To do such activities which are useful to reform Telangana state which was a separate state before 1956. to provide free education, employment, medical services and free looking after old aged persons

visiting counter

free hit counter
Download a free hit counter here.

Saturday, February 13, 2010

జై తెలంగాణా గీతాలు

అర్ధం కాని పాఠాలు అనగబట్టి నేర్పిండ్రు
ఫ్రెంచి కన్న కష్టంగుంది కాని, తెలుగే అని చెప్పిండ్రు
ఎప్పుడు ఇనని భాష, ఎవ్వడు మాట్లాడని భాష
తాత్పర్యం తప్పు చెప్తే ఇరగమర్గ దంచిండ్రు

మా అయ్యకి అర్ధం కాలె, మా సర్పంచికి సదవరాలె
ఎవ్వడు రాసిండో ఏమొ, మా తాతకి పలకనే రాలె
చిన్న పోరగాడ్ని జేసి తప్పు తెలుగు నేర్పిండ్రు
మా గల్లీలనా మాటాలిని ముడ్డితోని నవ్విండ్రు

ఏం భాష ఇది? ఎవని యాస ఇది?
ఎవనయ్యతో నేను నా గోస చెప్పుకునేది?
ఇక చాలు ఆపాలె, ఈ పరాయోండ్ల వ్యాసాలు
ఇక నుండి నేర్పాలె నాకు, 'నా తెలుగు' పాఠాలు
JAI TELANGANA
JAI JAI TELANGANA.....

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.

Followers