To do such activities which are useful to reform Telangana state which was a separate state before 1956. to provide free education, employment, medical services and free looking after old aged persons

visiting counter

free hit counter
Download a free hit counter here.

Tuesday, February 23, 2010

తెలంగాణా న్యూస్ పేపర్ ప్రకటనలు



సాక్షి

Saturday, February 20, 2010

to view telangana sacrifice click below

http://www.youtube.com/watch?v=wPlHX0FNirU


*

Monday, February 15, 2010

కోటి రతనాల వీణ తెలంగాణా

ప్రియమైన తెలంగాణా మిత్రులారా! మీ ఏరియా లో జరుగుతున్న తెలంగాణా ఉద్యమ విశేషాలను ఫోటో లు తీయండి. వీడియో లు తీయండి. ఇంతటి ప్రజాస్వామిక ఉద్యమము మల్లి ఎప్పుడు కూడా చూడలేము. ఉద్యమ విశేషాలు భావితరాలవారికి ఆదర్శం.అందుకే తెలంగాణా ఉద్యమానికి సజీవ సాక్ష్యలుగా మిగిలే ఫోటో లు వీడియో లు తీసి, నాకు పంపగలరు. అంటే కాకుండా ఆంద్ర పెట్టుబడి దారుల మీడియా చానెల్ లు పక్షపాత వైఖరితో, వీలైనంత వరకు వాస్తవాలను వక్రీకరించడానికి లేదా కప్పి పుచ్చడానికి లేదా సమైక్య(దోపిడీ)వాదాన్ని బాల పరచడానికి ప్రత్నిస్తున్నారు. కావున తెలంగాణా కోసం, తెలంగాణా వారిచే నడపబడు మీడియా చానెల్ ను ప్రారంభించాలి. తెలంగాణా మీడియా చానెల్ ప్రారంభ మయ్యేవరకు ఈ ఆర్కుట్ ను ఉపయోగించుకొని సమాచారము ఇచ్చి, పుచ్చుకుందాం. గ్రామ గ్రామాన ఒక ఉచిత ఇంటర్నెట్ సదుపాయాన్ని కల్పించుదాం. హెల్త్ బుక్స్ అమ్మకాల ద్వారా లేదా ఇతర మెడికల్ చెక్ అప్స్ ద్వారా సిస్టం లను కొనుటకు కావలిసిన డబ్బులను సేకరిద్దాము. మరెన్నో కార్య క్రమముల ద్వారా తెలంగాణా ను సాదించడమే గాకుండా తెలంగాణా వచ్చిన తర్వాత కూడా తెలంగాణా ప్రజల సౌఖ్య & సంక్షేమ జీవితానికి కృషి చేద్దాము. ప్రతి ఒక్కరు ఈ ఆర్కుట్ ఫ్రెండ్స్ అవ్వండి. email: telugu.email.list@yanthram.com

Saturday, February 13, 2010

తెలంగాణా స్టూడెంట్స్ అసోసియేషన్

ఇక్కడ ఆంధ్ర కాలనీ లు బెట్టుకున్న ఏమన్లేదు.
పచ్చల్లమ్ముకోవడానికి వచ్చినొడు పత్రికల అధిపతులైన ఏమన్లేదు.


మీ విశ్వనాథ, శ్రీ శ్రీ లకు వినమ్రంగ మొక్కుతాము…
మా ధాశరథి కాళోజీ లను దాశిపెట్టుడు తప్పు కాదా..?


మనకు బతకడం రాదు అన్నోడు, మనను మోటు మన్శులన్నోడు, మన తిండి ని సూశి నవ్వినోడు, మనది తెలుగే కాదన్నోడు, శిగ్గు షరం లేక మనందరం ఒక్కటె కలిసే ఉందాం అంటున్నడు.


బతుకమ్మకు అట్లతద్దె కు బందుత్వం ఎప్పటిది..!
ని అట్టు కు నా జొన్నరొట్టెకు చుట్టరికం ఎక్కడిది..?



నామాటలల్ల అక్కడక్కడ సభ్యతలేదనే ఆక్షేపణవస్తదని నాకెర్కే, కాని నాభాష, నాయాస, నాబతుకు, నా తెలంగాణ ప్రజల పట్లసభ్యతగా ప్రవర్తీంచని వాణితో నాకేం సభ్యత అనేదే నా జవాబు.
- కాళోజి నారాయణరావు


ఖండాలు దాటిన జానపద గీతం నాది.
ప్రపంచ చరిత్ర కే పాఠాలు నేర్పిన పోరాటాల వారసత్వం నాది.



చేతుల చెయ్యేసుకొని తల్లికి జై కొడదాం రండి...!
ఈ నేలను అవమానించినోని గుండెల్లో తెలంగాణ డప్పుల దరువెద్దాం రండి..!!!



జై తెలంగాణ..!
జై జై తెలంగాణ !!!

తెలంగాణా స్టూడెంట్స్

ఖండాలు దాటిన జానపద గీతం నాది.
ప్రపంచ చరిత్ర కే పాఠాలు నేర్పిన పోరాటాల వారసత్వం నాది.



చేతుల చెయ్యేసుకొని తల్లికి జై కొడదాం రండి..!
ఈ నేలను అవమానించినోని గుండెల్లో తెలంగాణ డప్పుల దరువెద్దాం రండి..!!



జై తెలంగాణ..!

శ్రీను నాయక్

మా తెలంగాణా తల్లికి మల్లె పూదండ
మా కన్నతల్లికి మంగళారతులు
కడుపులో బంగారు, కనుచూపులో కరుణ
చిరునవ్వులో సిరులు దొరలించు మాతల్లి

గలగలా గోదారి కదలిపోతుంతేను
బిరబిర కృష్ణమ్మ పరుగులిడుతుంటెను
బంగారు పంటలే పందుతాయి
మురిపాల ముత్యాలు దొరలుతాయి

నైజాం నగరి అపురూప అందాలు
రాందాసు గొంతులో తారాదునాదాలు
తిక్కయ్య కలములో తియ్యందనాలు
నిత్యమై నిఖిలమై నిలిచియుండేదాక

రుధ్రమ్మ భుజశక్తి, మల్లమ్మ పతిభక్తి
తాన్ సేన్ ధీయుక్తి, నవాబువారి కీర్తి
మా చెవులు రింగుమని మారుమ్రోగేదాక
నీ పాతలే పాడుతం, నే ఆతలే ఆడుతం
జై తెలంగాణా తల్లి జై తెలంగాణా తల్లి

మన తెలంగాణా

నాలుగు మెతుకుల ఆకలి చావులు,
నాలుగు గోడల మధ్య ఉన్న బలిసినోడికి కానరావు.
నడవలేని ఫ్లోరైడ్ బాధలు ,
ac గదులలో మినెరల్ నీరు త్రాగే స్తిమంతుండికి ఏమి తెలుసు.
పత్తి రైతుల ఆత్మహత్యలు,
పట్టు పంచే కట్టే నాయకుడుకు కానరావు.
ఆస్థి ఉన్నోడికి ఏమి తెలుసు ,
పేదవాడు అసతిపంజరాముతుంటే .
కానరాలేదు ఆనాడు..,
బాగుపడుధమంటే సమైక్యమంటూ...నారు ఈనాడు......
........... జై తెలంగాణా

మన telangana

కలం పట్టి కవిత నా తెలంగాణా కోసం........



కాదు పోమంటే కళ్ళు పట్టె,
కసాయి నీ నమ్మ్బోకు తెలంగాణా తమ్ముడా ....
సమైక్యమంటూ సాంతం దోచుకునే దాక .........
గొంతుకు కొక్కేయం వేస్తారు అన్నయ ....
జరా ఫైలం కలలోలిన కరుణ చూపకు..
ఈ కసాయి ఫైన ..........
......జై తెలంగాణా

తెలంగాణా స్టూడెంట్

హిందీ" మాట్లాడేవాళ్ళు ఎనిమిది రాష్ట్రాల్లో ఉంటె ,, తెలుగు వాళ్ళు రెండుగుంటే బాషకొచ్చే ముప్పెంటి ?? తెలంగాణా రాష్ట్రమైతే ముంచుకొచ్చే తప్పేంటి ??

"ఇక్కడ మావాళ్ళు తినడానికి తిండి లేక ఉద్యమం చేస్తుంటే ...అక్కడ మీరు తిన్నది అరగక లొల్లి చేస్తున్నరు" "మాదిRealSTATEకోసం, మీదిRealESTATEకోసం"

హైదరాబాద్ ని డెవలప్ చేసినం అంటుండ్రు సంయుక్త ఆంధ్రప్రదేశ్ లో హైదరాబాద్ లో కొత్తగా నిర్మించిన ఒక్క రైల్వేస్టేషన్ అన్న ఉందా

పెట్టుబడులు అన్ని బయటి నుంచే వచ్చాయి
హైదరాబాద్ కాపిటల్ కాబట్టి, ఇక్కడ కంపెనీలు పెడితే లాబాలు బాగా వస్తాయ్,
మమ్మల్ని బాగా ముంచొచ్చు కాబట్టి వచ్చారు అంతే కానీ మమ్మల్ని ఉద్దరిద్దామని కాదు కదా

"అదే చార్మినార్ ,అదే ఉస్మానియా యూనివెర్సిటి, అదే సాలార్జంగ్ ,అదే గోల్కొండ,అదే అసెంబ్లీ,అదే సచివాలయం ,అదే గాందీ హాస్పిటల్,అదే ఫలక్నుమా ప్యాలస్,అదే ట్యాంక్ బండ్ ఇంకా మేరు వచినంక అది కరాబ్ అయ్యింది దాని మీద మీ అంద్రోళ్ళ విగ్రహాలు పెట్టుకుండ్రు ఇదేనా అబివృద్ది "

కృష్ణమ్మా నీళ్ళు మా బీళ్ళను తడపలేదు
గోదావరి మా గోడు తీర్చలేదు
see this

జై తెలంగాణా గీతాలు

అర్ధం కాని పాఠాలు అనగబట్టి నేర్పిండ్రు
ఫ్రెంచి కన్న కష్టంగుంది కాని, తెలుగే అని చెప్పిండ్రు
ఎప్పుడు ఇనని భాష, ఎవ్వడు మాట్లాడని భాష
తాత్పర్యం తప్పు చెప్తే ఇరగమర్గ దంచిండ్రు

మా అయ్యకి అర్ధం కాలె, మా సర్పంచికి సదవరాలె
ఎవ్వడు రాసిండో ఏమొ, మా తాతకి పలకనే రాలె
చిన్న పోరగాడ్ని జేసి తప్పు తెలుగు నేర్పిండ్రు
మా గల్లీలనా మాటాలిని ముడ్డితోని నవ్విండ్రు

ఏం భాష ఇది? ఎవని యాస ఇది?
ఎవనయ్యతో నేను నా గోస చెప్పుకునేది?
ఇక చాలు ఆపాలె, ఈ పరాయోండ్ల వ్యాసాలు
ఇక నుండి నేర్పాలె నాకు, 'నా తెలుగు' పాఠాలు
JAI TELANGANA
JAI JAI TELANGANA.....

జై తెలంగాణా

జై తెలంగాణా జై తెలంగాణా

Followers